నెల్లూరు జిల్లా.. ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని జేఆర్‌పేటలో నిన్న పాజిటివ్ కేసు ఒకటి నమోదైంది. చెన్నై నుంచి మూడు రోజుల క్రితం ఒక మహిళ ఇక్కడికి వచ్చింది. వచ్చిన రోజే ప్రభుత్వ ఆస్పత్రిలో వారికి పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు నిన్న రాగా ఆమెకు పాజిటివ్ ఉన్నట్లు తేలింది. జగన్నాథరావు పేటకు చుట్టూ 400 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న వ్యాపార సంస్థలు అన్నీ 14 రోజుల పాటు మూసివేయాలని అధికారులు సూచించారు. కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు అవసరమైతే మున్సిపల్ కాల్ సెంటర్ నెంబర్ 220385 కు ఫోన్ చేస్తే మునిసిపాలిటీ వారే ఇంటి దగ్గరకు వచ్చి సరకులను అందిస్తారని తెలిపారు.
కంటైన్మెంట్ జోన్‌గా జగన్నాథరావు పేట - కంటోన్మెంట్ జోన్‌గా జగన్నాథరావు పేట
నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దీంతో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
corona cases