ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలందిస్తాం' - ఏపీ ప్రధాన వార్తలు

Nellore Narayana Medical College : పేద ప్రజలకు సేవ చేయటమే తమ లక్ష్యమని నెల్లూరు జిల్లాలోని వైద్య కళాశాల విద్యార్థులు తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేని ప్రజలకు.. ఉత్తమ సేవలు అందిస్తామని కొత్తగా వైద్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులు వివరించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 17, 2023, 5:34 PM IST

Convocation in Nellore Narayana Medical College : గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించి.. ప్రజలకు అనారోగ్యం నుంచి స్వాంతన చేకూరుస్తామని వైద్య విద్యార్థులు అంటున్నారు. పేదలు అధికంగా ఉండే గ్రామాల్లోనే తమ సేవలను అందిస్తామంటున్నారు. అన్నదాతలకు పుట్టినిల్లుగా విరసిల్లుతున్న గ్రామీణ ప్రాంతాల్లో సేవాభావంతో వైద్య వృత్తిని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలోని వైద్య విద్యార్థులు ఇలా తమ మనసులోని మాటలను చెప్తున్నారు. కళాశాలలో స్నాతకోత్సవం నిర్వహించగా.. వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు సభావేదికపై తమ మనసులోని ఆలోచనలను బయటపెట్టారు.

నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కళాశాలలో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు, కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు కళాశాల యాజమాన్యం పట్టాలను అందించింది. మెరుగైన స్థానాలలో నిలిచిన వారికి పతకాలను ప్రదానం చేశారు. ప్రతిభకు కొలమానంగా భావించే పతకాలను అందుకున్న విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైద్య విద్యను పూర్తి చేసుకుని వైద్య వృత్తిలోకి అడుగుపెడుతున్నందుకు తమకు సంతోషంగా ఉందని విద్యార్థులు అంటున్నారు.

విద్యను పూర్తి చేసుకుని సమాజంలోకి వైద్యులుగా అడుగు పెడుతున్నామని.. అందువల్ల తమ సేవలను గ్రామీణ ప్రాంతల్లో అందిస్తామని తెలిపారు. కళాశాల విద్య పూర్తైందని.. యువ వైద్యులుగా మారినట్లు వారు వివరించారు. వైద్యులుగా మారిన తర్వాత తమ సేవను పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో అందిస్తామని వెల్లడించారు. సాంకేతికత అందుబాటులో లేని ప్రజలకు తమ సేవలను అందిస్తామని అన్నారు. వారికి అందుబాటులో లేని మెరుగైన వైద్య సౌకర్యాలను వారి చేరువకు తీసుకువస్తామన్నారు. ఈ మాటలు విన్న విద్యార్థుల తల్లిదండ్రులు, రాష్ట్ర అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థుల ఆలోచన తీరుపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

నాలుగు సంవత్సరాలుగా కలిసి విద్యను అభ్యసించిన విద్యార్థుల ఆత్మీయ పలకరింపులు, ఆలింగనలను చూస్తే.. విడిపోతున్నారనే బాధకు అద్దం పట్టినట్లుగా కనిపించింది. భవిష్యత్​ లక్ష్యాలపై విద్యార్థుల ఆలోచనలు, దిశమార్గాల ఎంపికల చర్చలతో స్నాతకోత్సవ కార్యక్రమ సభ ప్రాగంణం హడావుడిగా తయారయ్యింది. స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు భవిష్యత్​ నిర్మాణం కోసం సూచనలు, దిశ మార్గాలతో సభ పండగ వాతావరణంతో నిండిపోయింది.

వైద్య సేవలలో అగ్రగామిగా నిలుస్తూ పేదలకు సేవలను అందించాలని కళాశాల యాజామాన్యం విద్యార్థులకు సూచించింది. వైద్య విద్యలోకి అడుగు పెట్టిన దగ్గరి నుంచే విద్యార్థులను సమాజం, తల్లిదండ్రులు వైద్యులుగా పరిగణిస్తారని.. విద్యార్థులు కూడా తమను వైద్యులుగానే భావించుకుని విద్యను అభ్యసించాలని సూచించారు. వృత్తి కోసం చేసే కృషి మంచి స్థానాన్ని అందిస్తుందని వివరించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరితే తల్లిదండ్రులు, గురువులు సంతోషిస్తారని వివరించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details