ఆస్తి అమ్మకం విషయంలో తండ్రి-కుమారుల మధ్య జరిగిన గొడవ చంపుకునే వరకు వెళ్లింది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కండాపురం గ్రామానికి చెందిన గోళ్ల శ్రీనివాసులుకు అతని కుమారుడు కోటేశ్వరావుకు ఆస్తి అమ్మకం విషయంలో వివాదం జరిగింది. కోపోద్రిక్తుడైన కుమారుడు కత్తితో తండ్రిని దారుణంగా నరికి చంపాడు. ఎవ్వరికీ తెలియకుండా శవాన్ని గోప్యంగా పూడ్చిపెట్టాడు.
ఆస్తి అమ్మకంలో వివాదం: తండ్రిని చంపిన తనయుడు - AP Crime news
రాక్షస విలువలతో... మానవ ధర్మం మంటగులుస్తోంది. ఆస్తి కోసం కన్నవారినీ హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆస్తుల ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చిన్నబోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కండాపురంలో.. ఓ కుమారుడు తన తండ్రిని చంపి శవాన్ని మాయం చేశాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా... దర్యాప్తులో శవం ఆచూకీ తెలిసింది.
తండ్రిని చంపిన తనయుడు
కోటేశ్వరరావు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పొదలకూరు సీఐ గంగాధరావు చేజర్ల తహసీల్దార్ శ్యాంసుందరాజు సమక్షంలో పూడ్చిన శవాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ... చిన్న వయసులో పెద్ద బాధ్యత.. చిత్తు కాగితాలు ఏరుతూ.. తండ్రి బాగోగులు