Nellore District Consumer Forum: మహిళకు వైద్యం చేయడంలో ఓ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ ఆ మహిళకు రూ.15 లక్షలు పరిహారంగా ఇవ్వాలని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ప్రెసిడెంట్ జింకారెడ్డి శేఖర్ బుధవారం తీర్పు ఇచ్చారు. ఈ మేరకు తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల యాజమాన్యాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
వైద్యుల నిర్లక్ష్యం.. రోగికి రూ.15 లక్షల పరిహారం.. ఎక్కడంటే..! - Consumer Disputes
Consumer Disputes: కాన్పు కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చేరింది ఓ మహిళ. ఆమెకు శస్త్రచికిత్స చేసిన తరువాత కడుపులో 18×17 సెంటీమీటర్ల పరిమాణం గల దూదిని వదిలారు వైద్యులు. వారి నిర్లక్ష్యానికి నరకయాతన అనుభవించింది ఆ మహిళ. వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల నుంచి తమకు రూ.19.90లక్షల నష్ట పరిహారం ఇప్పించాలని నెల్లూరు వినియోగదారుల కమిషన్‌లో ఆమె భర్త కేసు వేశారు. కాటన్ స్పాంజ్‌ను కడుపులో వదిలేసి కుట్లు వేశారని నిర్ధారణకు వచ్చి రశీలకు రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.
ఏఎస్‌పేటకు చెందిన ఫాతీం భార్య షేక్ రశీలభాను కాన్పు కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చేరారు. 2015 నవంబరు 27న శస్త్రచికిత్స చేశారు. డిశ్చార్జి అయి ఇంటికెళ్లిన తర్వాత ఆమెకు కడుపునొప్పి ప్రారంభమైంది. హైదరాబాద్, విజయవాడ, వేలూరు తదితర నగరాల్లోని తొమ్మిది ఆసుపత్రుల్లో దాదాపు రెండేళ్లు చికిత్స పొందినా ఫలితం కనిపించలేదు. చివరకు 2017 జూన్ 17న నెల్లూరు కిమ్స్ (బొల్లినేని) ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి కడుపులో 18×17 సెంటీమీటర్ల పరిమాణం గల దూది ఉందని గుర్తించి శస్త్ర చికిత్స చేసి తొలగించారు. తమకు నష్టం కలిగించిన వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల నుంచి తమకు రూ.19.90లక్షల నష్ట పరిహారం ఇప్పించాలని నెల్లూరు వినియోగదారుల కమిషన్‌లో రశీల కేసు వేశారు. కాన్పునకు సంబంధించి సీఎంసీ ఆసుపత్రి స్పాంజ్ అకౌంట్ రికార్డును వినియోగదారుల కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఒక కాటన్ స్పాంజ్‌ను కడుపులో వదిలేసి కుట్లు వేశారని నిర్ధారణకు వచ్చి రశీలకు రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సీఎంసీ ఆసుపత్రి యాజమాన్యాన్ని వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ జింకారెడ్డి శేఖర్ ఆదేశించారు. ఈ మొత్తం 45 రోజుల్లో చెల్లించకపోతే తీర్పు వెలువడిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి