ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం చాటుకున్న ఆత్మకూరు ఠాణా కానిస్టేబుల్ - ఆత్మకూరు పోలీస్ తాజా వార్తలు

ఆత్మకూరు పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ తన మానవత్వం చాటుకున్నాడు. ఎవరూ చేరదీయని ఓ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు కృషిచేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాసులు చేసిన పనిని స్థానికులు మెచ్చుకున్నారు.

potti sree ramulu nellore district police helping old age women
వృద్ధురాలిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

By

Published : Sep 3, 2020, 10:49 PM IST

ఆత్మకూరులోని శివాలయం ప్రాంతంలో ఓ వృద్ధరాలు జ్వరంతో బాధపడుతోంది. భయంతో స్థానికులు ఎవరూ కనీసం ఆమె దగ్గరకు కూడా వెళ్లలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లడానికీ ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆత్మకూరు పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వర్తించే శ్రీనివాసులు ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు చొరవ చూపారు.

ఆ అనాథ వృద్ధ మహిళ వద్దకు ఎవరు వెళ్లకుంటే.. తాను అటెండర్​గా ఉంటానని 108 వాహన సిబ్బందికి హామీ ఇచ్చి… శ్రీనివాసులు ఆమెను ఆసుపత్రికి చరలించారు. ప్రస్తుతం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఆ వృద్ధరాలు చికిత్స పొందుతోంది.

ABOUT THE AUTHOR

...view details