ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన - శైలజానాథ్ వార్తలు

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయంగా ఉన్న ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Congress party concern
కాంగ్రెస్ పార్టీ ఆందోళన

By

Published : Jul 8, 2021, 4:56 PM IST

రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాభవన్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పెట్రోల్ కొనుగోలుకు వచ్చిన వాహనదారుల నుంచి శైలజానాథ్ సంతకాలు సేకరించారు.

కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపడం దారుణమని శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజల నుంచి ఇప్పటికే రూ.14 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. అంతర్జాతీయంగా ఉన్న ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details