ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

viral:వియ్యంకుల మధ్య గొడవ...వైరల్​గా మారిన దృశ్యాలు - నెల్లూరు జిల్లా ముఖ్యంశాలు

ఏడడుగులు మూడుముళ్లతో ముడిపడిన వివాహ బంధం ఆర్థిక గొడవలతో వివాదమైంది. భర్త ఇటీవల ఆత్మహత్య చేసుకోవటంతో భార్యకు కష్టాలు మొదలయ్యాయి. కళ్లెదుటేఅత్తమామలు, తల్లిదండ్రులు రాళ్లతో దాడి చేసుకోవటంతో చేతిలో చంటిబిడ్డను ఒడిలో పట్టుకుని ఆమె కన్నీటి పర్యంతమైంది.

viral:వియ్యంకుల మధ్య గొడవ...వైరల్​గా మారిన దృశ్యాలు
viral:వియ్యంకుల మధ్య గొడవ...వైరల్​గా మారిన దృశ్యాలు

By

Published : Sep 3, 2021, 7:48 AM IST

viral:వియ్యంకుల మధ్య గొడవ...వైరల్​గా మారిన దృశ్యాలు

చెంపదెబ్బలతో మొదలుపెట్టి రాళ్ల దాడికి దిగిన వీళ్లు వియ్యంకులు. నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంలో ఏడాది క్రితం.. పిల్లల పెళ్లిళ్లు జరిపించారు. ఆ తర్వాత కట్నకానుకలంటూ మొదలైన గొడవ క్రమంగా పెరిగి పెద్దదై..సిగపట్ల వరకూ వచ్చింది. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ప్రభాకర్‌ రెడ్డి కుమార్తె ఊహారెడ్డిని నెల్లూరు రూరల్‌ ధనలక్ష్మీ పురానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి కుమారుడు అఖిల్‌ కుమార్‌ రెడ్డికి ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు.

అఖిల్‌ రెండు నెలల క్రితమే రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచీ కోడలికీ, అత్తమామలకూ మధ్య గొడవలు పెరిగాయి. కోడలే తమ కుమారుడు మరణానికి కారణమని నాగేశ్వర్‌రెడ్డి దంపతులు ఆరోపించగాకిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతోనే తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడని ఊహారెడ్డి వాపోతోంది. ఈ పరస్పర ఆరోపణలు పెద్ద గొడవకు దారితీయటంతోకోడలిని అత్తమామలు ఇంట్లోకి రానియ్యలేదు.

దీన్ని ప్రశ్నించేందుకు ఊహారెడ్డిని వెంటబెట్టుకుని తల్లిదండ్రులు.. నేరుగా వియ్యంకుడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి.. బహిరంగంగా దాడి చేస్తుకున్నారు. 6 రోజుల క్రితం జరిగిన కొట్లాట దృశ్యాలు వైరల్‌గా మారటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును లోతుగా విచారించి త్వరలోనే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:
అశ్లీల నృత్యాల కేసులో 31 మంది అరెస్టు

ABOUT THE AUTHOR

...view details