నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామి పల్లి గ్రామానికి చెందిన కార్తీక్ మహిమలూరులో 9 వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం పాఠశాల నుంచి గ్రామానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కి వెనుకవైపు కూర్చున్నాడు విద్యార్థి కార్తిక్. తన దగ్గరికి వచ్చి టికెట్ తీసుకులేదని కోపంతో కండక్టర్ దూషించాడు. తనను ఎందుకు దూషిస్తున్నావని అడగగా దాడి చెేసినట్లు విద్యార్థి వాపోయాడు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి కండక్టర్ను నిలదీయగా దిక్కున్నచోట చెప్పుకోమన్నారన్నారు. ఈ విషయంపై కార్తీక్ తండ్రి.. ఆర్టీసీ డీఎం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కండక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థిపై దాడికి పాల్పడిన కండక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
విద్యార్థిపై కండక్టర్ దాడి - నెల్లూరు జిల్లా రామస్వామి పల్లి విద్యార్థిపై కండక్టర్ దాడి
తన దగ్గరకి వచ్చి టికెట్ తీసుకోలేదని కోపంతో విద్యార్థిపై కండక్టర్ దాడిచేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామి పల్లిలో జరిగింది. కండెక్టర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి.. ఆర్టీసీ డీఎం, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![విద్యార్థిపై కండక్టర్ దాడి విద్యార్థిపై కండక్టర్ దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10362370-1058-10362370-1611485237199.jpg)
విద్యార్థిపై కండక్టర్ దాడి
TAGGED:
Conductor attack on student