ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూదరుల అరెస్ట్.. సెబ్ పోలీసుల తీరుపై గ్రామస్థుల అభ్యంతరం - సెబ్ ఆధికారులపై ఫిర్యాదు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరులో ఎస్​ఈబీ అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. జూదరుల వద్ద సొమ్ము తీసుకుని కొందరిని వదిలేశారంటూ గ్రామస్థులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

seb raids poker sites at nellore
ఎస్​ఈబీ ఆధికారులపై ఫిర్యాదు

By

Published : Mar 29, 2021, 3:50 PM IST

ఎస్​ఈబీ అధికారులు.. నెల్లూరు జిల్లా దేపూరు వద్ద పేకాట స్థావరాలపై దాడి చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురి వద్ద డబ్బు తీసుకొని వదిలేశారని, మిగిలిన వారితోనూ మంతనాలు చేస్తున్నారని దేపూరు గ్రామస్థులు ఆరోపించారు. సెబ్​ అధికారులను అడ్డుకుని నిర్బంధించారు.

ఈ వ్యవహరంపై ఆత్మకూరు పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. ఎస్సై రవినాయక్‌కు ఫిర్యాదు చేశారు. చివరికి.. పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి సెబ్ సిబ్బందిని విడిపించారు. జూద ఘటనకు సంబంధించి మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లనుంచి రూ. 20 వేల నగదు, ఐదు వాహనాలను సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details