నెల్లూరు జిల్లా సోమశిల జలాశయాన్ని నిపుణుల కమిటీ సందర్శించనుంది. ఈ నెల 9న నిపుణుల కమిటీ జిల్లాకు రానుంది. రెండు రోజులు పాటు జలాశయం పరిస్థితిని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నారు. ఇటీవల భారీ వరద పోటెత్తడంతో సోమశిల జలాశయం ముందు భాగం పగిలిపోయింది. నీటి ఉద్ధృతికి కాంక్రీటు కొట్టుకుపోయింది.
జనవరి 9న సోమశిల జలాశయాన్ని సందర్శించనున్న నిపుణుల కమిటీ - సోమశిల జలాశయం రిపేర్లు
జనవరి 9న సోమశిల జలాశయాన్ని నిపుణుల కమిటీ సందర్శించనుంది. భారీ వరదలకు దెబ్బతిన్న జలాశయాన్ని పరిశీలించి.. నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సుమారు రూ. 60 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
Committee of Experts to visit Somshila Reservoir on January 9
వరద తగ్గిన తర్వాత అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సుమారు రూ. 60 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశారు. ఈ నెల 9న నిపుణుల కమిటీ పరిశీలించి మరో నివేదిక ఇవ్వనుంది. సంక్రాంతి తర్వాత మరో కమిటీ జలాశయాన్ని పరిశీలించనుంది.
ఇదీ చదవండి: 2022 నాటికి అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం : సీఎం