ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 23, 2020, 8:56 PM IST

ETV Bharat / state

పంట ముంపు ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ కమిషనర్ పర్యటన

నెల్లూరు జిల్లా కొడవలూరులో పంటముంపునకు గురైన పొలాల్లో వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యటించారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని... రైతులు వీటిని వినియోగించుకుని నూతన వ్యవసాయ పద్దతులపై శిక్షణ పొందాలన్నారు

Commissioner of Agriculture visits  areas in Kodavalur
కొడవలూరులో పంటముంపు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ కమిషనర్ పర్యటన



నెల్లూరు జిల్లా కొడవలూరు, కోవూరు మండలాల్లో వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యటించారు. కొడవలూరు మండలం బసవయ్యపాలెం గ్రామంలో వర్షం వల్ల నష్టోయిన కౌలురైతు రమణమ్మ పొలాన్ని కమిషనర్ పరిశీలించారు. నష్టం గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బసవయ్యపాలెం గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. అమ్మకాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని... పంట పండించిన తాము అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు కమిషనర్ కి తెలిపారు. ఎవరు అధైర్యపడవద్దని... పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు అవసరమైన డ్రైయర్ మిషన్లు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు మద్దతు ధర రావడం లేదని... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చిందని, వెంటనే రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.

పంటను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ కమిషనర్ పర్యటన

గోదావరి జిల్లా నుంచి మిల్లర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని... రైతులు వీటిని వినియోగించుకుని నూతన వ్యవసాయ పద్దతులపై శిక్షణ పొందాలన్నారు. ఎరువులు అధికంగా వాడటం వల్ల పంట దిగుబడి తగ్గుతుందన్నారు. మిల్లర్లు, దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మిల్లర్లతో సమావేశమై.. ప్రతి గింజను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించారన్నారు. ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రం ఉంటే... ఆ గ్రామంలో పండిన పంటను అక్కడే అమ్ముకోవచ్చని, దీనివల్ల మిల్లర్లు, దళారులకు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తేమ శాతాన్ని గుర్తించే పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. పంట పండించిన ప్రతి రైతు పేరు ఈ క్రాప్​లో నమోదు చేస్తామని, ఆ రైతులకు తప్పనిసరిగా మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే సీజన్ నుంచి ఇది తప్పకుండా అమలవుతుందని.., అందువల్ల రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి.కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసిన అమరావతి ఐకాస నేతలు

ABOUT THE AUTHOR

...view details