నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేస్-2 ప్రాజెక్ట్ పైలాన్‌ను సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ హాజరవుతుండటంతో ముందస్తుగా అధికారులు అన్ని ఏర్పాట్లను పరిశీలించారు.
కృష్ణాపురం వద్ద పనులను పరిశీలించిన కలెక్టర్ - నెల్లూరు వార్తలు
సోమశిల హై లెవల్ లిఫ్ట్ కెనాల్ ఫేస్-2 ప్రాజెక్ట్ పైలాన్ ను సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అక్కడి పనులను నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులతో కలిసి పరిశీలించారు.
కృష్ణాపురం వద్ద పనులను పరిశీలించిన కలెక్టర్