ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అదనంగా డబ్బులు వసూలు చేస్తే.. లైసెన్సులు రద్దు చేస్తాం' - నెల్లూరులో కోవిడ్​పై కలెక్టర్ సమీక్ష

కరోనా కట్టడిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆసుపత్రిలో 50శాతం ఆరోగ్య శ్రీకి పడకలు ఇచ్చిన తర్వాతే మిగిలిన వారికి కేటాయించాలని స్పష్టం చేశారు. కొవిడ్ పేరుతో అర్హతలేనివారు వైద్యం అందిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

nellore
నెల్లూరులో కోవిడ్​పై కలెక్టర్ సమీక్ష

By

Published : May 16, 2021, 7:34 PM IST


నెల్లూరు జిల్లాలో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్​తో కలిసి కలెక్టరేట్​లోని తిక్కన భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 36 కోవిడ్ ఆసుపత్రుల్లో 2,848 పడకలు, 12 కోవిడ్ కేర్ కేంద్రాలలో 3,500 పడకలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో 50శాతం ఆరోగ్య శ్రీ, ఇహెచ్ఎస్​కి పడకలు ఇచ్చిన తర్వాతే మిగిలిన వారికి కేటాయించాలన్నారు. అన్నీ ప్రైవేటు హాస్పిటళ్లు వైద్యానికయ్యే ఖర్చు వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా బాధితుల నుంచి అదనంగా వసూలు చేస్తే, హాస్పిటల్ లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఇకపై 104 ద్వారానే అడ్మిషన్లను తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మూడు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని, ఓ హాస్పిటల్​ను మూసేశామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details