నవంబర్ రెండో తేది నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... నెల్లూరు జిల్లాలోని పాఠశాలల నిర్వహణపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల యజమానులు హాజరయ్యారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ... తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు కరోనా సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చ జరిపారు.
ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల యజమానులతో కలెక్టర్ సమావేశం
నెల్లూరు జిల్లాలోని ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల యజమానులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కరోనా కారణంగా పాఠశాలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు.
పాఠశాలల యజమానులతో కలెక్టర్ సమావేశం