తుపాన్ వల్ల నెల్లూరు జిల్లాలో జరిగిన నష్టాలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితో కలిసి దెబ్బతిన్న రోడ్లను చూశారు. వెంటనే వాటి నిర్మాణం చేస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. నివర్ కారణంగా జిల్లాకు తీవ్ర నష్టం కలిగిందని అన్నారు. పంట నష్టాలను ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు సహాయం అందుతుందని చెప్పారు. మళ్లీ పంటలు సాగుకు 80శాతం సబ్సిడీపై విత్తనాలను అందిస్తామని అన్నారు.
నివర్తో దెబ్బతిన్న రోడ్లను బాగుచేస్తాం: కలెక్టర్ చక్రధర్
నివర్ తుపాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో భారీగా నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో కలెక్టర్ చక్రధర్ పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లను, పంటలను చూశారు. త్వరలోనే రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు.
నివర్ నష్టాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు