ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదవీ విరమణ పొందిన రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సన్మానం - నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు జిల్లాలో పదవి విరమణ పొందిన రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో... జిల్లా పాలనాధికారి చక్రధర్ బాబు సన్మానించారు. సుదీర్ఘ కాలంలో రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన తర్వాత వారిని సన్మానించే ఈ ప్రక్రియకు కలెక్టర్ చక్రధర్ బాబు నాంది పలకటం విశేషంగా ఉందని పలువురు అంటున్నారు.

Collector honors retired Revenue officers in nellore district
పదవీ విరమణ పొందిన రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సన్మానం

By

Published : Aug 8, 2020, 11:50 AM IST

నెల్లూరు జిల్లాలో పదవి విరమణ పొందిన రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో... జిల్లా పాలనాధికారి చక్రధర్ బాబు సన్మానించారు. ఆత్మకూరు మండల తహసీల్దార్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మధుసూదన్ రావును కలెక్టర్... పూలమాల, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సుదీర్ఘ కాలంలో రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసి ప్రజల మన్ననలు పొందిన అధికారులు పదవీ విరమణ పొందిన తర్వాత వారి గౌరవార్థం కలెక్టర్ కార్యాలయంలో వారిని సన్మానించే ఈ ప్రక్రియకు కలెక్టర్ నాంది పలకడం విశేషంగా ఉందని పలువురు చెబుతున్నారు.ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details