కొత్త రకం కరోనాపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తునట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు వెల్లడించారు. జిల్లాలో కొత్త రకం వైరస్ వ్యాపించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారమంతా అవాస్తవమని, ప్రజలెవరూ ఆందోళన గురికావద్దని ఆయన సూచించారు. కరోనాపై జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉందని, విమానాశ్రయంలోనూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
'కొత్త రకం వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారమంతా అవాస్తవం'
నెల్లూరు జిల్లాలో కొత్త రకం కరోనా వైరస్ వ్యాపించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారమంతా అవాస్తవమని కలెక్టర్ తెలిపారు. యూకే నుంచి వచ్చిన వారిలో ఒక్కరికి కరోనా నిర్ధారణ కాగా, అది కొత్త రకం వైరస్సా? కాదా? అని తెలుసుకునేందుకు నమూనాలను బెంగళూరుకు పంపామన్నారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు
విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు, వారితో సంప్రదింపులు జరిపిన వారికి కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహించామని కలెక్టర్ చెప్పారు. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన ఒక్కరికి కరోనా నిర్ధారణ కాగా, అది కొత్త రకం వైరస్సా? కాదా? అని తెలుసుకునేందుకు నమూనాలను బెంగళూరుకు పంపామన్నారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
సీఎం జగన్ రైతు పక్షపాతి: మంత్రి గౌతంరెడ్డి
TAGGED:
Covid Collector