ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనవరి నాటికి.. నెల్లూరు నగర వనం అందుబాటులోకి! - జనవరి నాటికి నెల్లూరు నగర వనం: కలెక్టర్​

నెల్లూరు నగర వనాన్ని జనవరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. కొత్తూరు సమీపంలోని ఏర్పాటు చేస్తున్న నగర వనాన్ని అటవీశాఖ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.

collector chakradhar ababu visit nagara vanam at kothur nellore district
జనవరి నాటికి నెల్లూరు నగర వనం: కలెక్టర్​

By

Published : Oct 12, 2020, 9:28 PM IST

వారాంతాపు సెలవుల్లో నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు నగర వనం ఎంతగానో దోహదపడుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. ఈ నరగ వనాన్ని జనవరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొత్తూరు సమీపంలోని నిర్మాణంలో ఉన్న వనాన్ని అటవీశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు.

అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శన

నగర వనంలోని వాకింగ్ ట్రాక్, యోగా సెంటర్, పిల్లల ఆటస్థలం, క్యాంటీన్, పార్కులో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో 30 శాతం వరకు అడవులున్నాయని, వివిధ ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణుల పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నగర వనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్​ఓ షణ్ముఖ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details