ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు​లో అందుబాటులోకి సీటీ స్కాన్, కొవిడ్ కేర్ సెంటర్లు: కలెక్టర్ - నెల్లూరు​లో అందుబాలోకి కొవిడ్ కేర్ సెంటర్లు

జిల్లాలోని పలు రెవెన్యూ డివిజన్లలో కొవిడ్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. 2,513 పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జీజీహెచ్​లో సీటీ స్కాన్​ సేవలు సైతం లభిస్తున్నాయని చెప్పారు.

collector chakradhar babu, ct scan in nellore ggh
కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు జీజీహెచ్​లో సీటీ స్కాన్

By

Published : Apr 24, 2021, 8:04 PM IST

నెల్లూరు జీజీహెచ్​లో సీటీ స్కాన్ పరీక్షల సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. జిల్లాలో కరోనా ఆసుపత్రులతో పాటు కావలి, ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరు రెవెన్యూ డివిజన్లలో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

2,513 పడకల వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కేటగిరి-బీలో ఉన్న నారాయణ ఆసుపత్రిని కేటగిరి-ఏ లోకి మార్చినట్లు వివరించారు. 104, 1077 కి కాల్ చేస్తే.. కరోనా చికిత్సకు సంబంధించి పూర్తి వివరాలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details