నెల్లూరు జిల్లా తడ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును జిల్లా కలెక్టర్ ఎం.వీ.శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ తనిఖీ చేశారు. సరిహద్దులోని చెక్ పోస్టు ద్వారా ఏపీలోకి వస్తున్న ప్రయాణికుల పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారా.. అని అధికారులను ప్రశ్నించారు. రిజిస్టర్ను పరిశీలించారు.
ప్రతి రోజు ఎంతమంది వలస కార్మికులు చెక్ పోస్టు ద్వారా చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వస్తున్నారని అడిగారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారి వివరాలపై ఆరా తీశారు. ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు తప్పని సరిగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.