రేపు నెల్లూరు జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. ఉదయగిరిలో జరిగే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరనున్నారు. అక్కడ్నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంట తరువాత తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
Mekapati Goutham Reddy Funerals: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. అయితే అంత్యక్రియలు జరిగే స్థలాన్ని మార్పు చేస్తున్నట్లు సోమవారం కుటుంబసభ్యులు ప్రకటించారు. తొలుత స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో జరపాలని భావించినప్పటికీ.. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిపేందుకు నిర్ణయించారు.
గౌతమ్ రెడ్డి మృతి.. ఏం జరిగిందంటే..?
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అనంతరం గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు 9.16గంటలకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
గౌతమ్‌రెడ్డి రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు.
రాష్ట్రంలో అధికార వైఎస్సార్‌సీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు.
గౌతమ్‌రెడ్డి తొలిసారిగా 2014లో ఆనం రామనారాయణ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నాయకుడిగా గౌతమ్ రికార్డు సృష్టించారు. 2019లో రెండో పర్యాయం ఆయన బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించి కేబినెట్ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో స్వల్పలక్షణాలు ఉండటంతో చికిత్స పొంది కోలుకొన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రొఫైల్..
* తల్లిదండ్రులు: మేకపాటి రాజమోహన్ రెడ్డి-మణిమంజరి