ETV Bharat / state
సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు సర్వం సిద్ధం - రైతు భరోసా పథకం
రేపు నెల్లూరు జిల్లా కాకుటూరులో సీఎం జగన్ రైతు భరోసా పథకం ప్రారంభించనున్నారు. కార్యక్రమం ఏర్పాట్లను వైకాపా నేతలు పర్యవేక్షిస్తున్నారు.
![సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు సర్వం సిద్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4745792-915-4745792-1571034556794.jpg)
సీఎం నెల్లూరు పర్యటనకు సర్వం సిద్ధం
By
Published : Oct 14, 2019, 1:27 PM IST
| Updated : Oct 14, 2019, 3:00 PM IST
సీఎం నెల్లూరు పర్యటనకు సర్వం సిద్ధం ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటనకు సర్వం సిద్ధమవుతోంది. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వేదికగా రేపు సీఎం "రైతు భరోసా" పథకం ప్రారంభిచనున్నారు. సభాస్థలి ఏర్పాట్లను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. వేలాదిమంది రైతులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. హాజరయ్యే వారి సంఖ్య భారీగా ఉంటుందనే అంచనాలతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ ప్రాంతంలో ఎంతమంది భద్రతా సిబ్బందిని నియమించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇదీ చదవండి
Last Updated : Oct 14, 2019, 3:00 PM IST