CM REVIEW ON CYCLONE EFFECT : మాండౌస్ తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్షించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎంవో అధికారులతో మాట్లాడారు. కోస్తాంధ్ర, రాయల సీమ జిల్లాల్లో తుపాను ప్రభావంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరవాలని అధికారులకు సూచించారు.
మాండౌస్ తుపానుపై సీఎం సమీక్ష.. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం - మాండౌస్
CM JAGAN REVIEW ON MANDOUS CYCLONE : మాండౌస్ తుపాను ప్రభావంపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తుపాను ప్రభావంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, భారీవర్ష సూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.
CM JAGAN REVIEW ON MANDOUS CYCLONE