Ramayam port: ఈ నెల 20న నెల్లూరు జిల్లాలో రామాయపట్నం ఓడరేవుకు సీఎం జగన్ శంకుస్థాపన - ramayamport
(Ramayampatnam port) ఈ నెల 20న నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబందించి స్థానిక ఎమ్మెల్యే, అధికార్లు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ నెల 20న నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవుకు సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారని ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అన్నారు. మొండివారి పాలెం వద్ద శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరిస్తారన్నారు. నెల్లూరు ,ప్రకాశం జిల్లాలకు మధ్యలో ఓడరేవును నిర్మించనున్నారని అన్నారు. ప్రాజెక్టు కోసం భూసేకరణ దాదాపు పూర్తైందని తెలిపారు. భూములు కోల్పోతున్న రావులపాలెం, మొండివారి పాలెం, కర్లపాలెం గ్రామస్థులకు పునరావాసం కోసం అవసరమైన లేఅవుట్లను సిద్ధం చేస్తున్నారని తెలిపారు.