ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 15న సింహపురి జిల్లాకు సీఎం జగన్ - సింహపురి జిల్లాకు సీఎం జగన్

సీఎం జగన్ ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్​ఆర్ రైతుభరోసా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సింహపురి జిల్లాకు సీఎం జగన్

By

Published : Oct 13, 2019, 8:17 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేయనున్న వైఎస్​ఆర్ రైతుభరోసా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జగన్ సీఎం అయిన తరువాత మొదటిసారి నెల్లూరు జిల్లాకు రానున్నారు.

మంత్రి అనిల్​కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వారం రోజులుగా సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అన్ని నియోజవర్గాల నుంచి రైతులు, జన సమీకరణకు చర్యలు చేపట్టారు. జిల్లా నుంచి 50వేల మంది రైతులు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభావేదికను అందంగా తీర్చిదిద్దారు. వాహనాల పార్కింగ్​కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.

ముఖ్యమంత్రి జగన్ 15వ తేదీ ఉదయం 9.30గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.15కి రేణిగుంట చేరుకుంటారు. 10.30కి ప్రత్యేక హెలికాప్టర్​లో కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీకి బయల్దేరుతారు. అక్కడకు చేరుకున్న తర్వాత ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. 11.30గంటలకు సభావేదికకు చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం 1.30గంటలకు హెలికాప్టర్​లో గన్నవరం బయల్దేరుతారు.

ఇదీ చదవండీ... రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు..నవంబర్​ 1 నుంచి అమలు

ABOUT THE AUTHOR

...view details