ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటంరెడ్డిపై వేటు.. నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి

CM JAGAN ON NELLORE ISSUE : నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డిపై వైసీపీ అధిష్ఠానం వేటు వేసింది. జిల్లా నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించింది. ఇంఛార్జ్​ బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించి ఆదాల ప్రభాకర్​ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది.

CM JAGAN ON NELLORE ISSUE
CM JAGAN ON NELLORE ISSUE

By

Published : Feb 3, 2023, 3:44 AM IST

CM JAGAN ON NELLORE ISSUE : నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డిని ఇంఛార్జ్​ బాధ్యతల నుంచి తొలగించిన పార్టీ అధిష్ఠానం.. ఆ ప్లేసులో ఎంపీ ఆదాల ప్రభాకర్​రెడ్డిని నియమించింది. నెల్లూరు జిల్లా వ్యవహారంపై వైసీపీ నేతలతో సీఎం జగన్‌ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

నిన్న నెల్లూరు వ్యవహారంపై నేతలతో చర్చించిన సీఎం జగ్​.. ఈరోజు మరోసారి సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డితో సమావేశం జరిపారు. నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్‌పై చర్చించి.. ఆ ​పదవి నుంచి కోటంరెడ్డిని తప్పించి.. ఆదాల ప్రభాకర్​ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం తాజాగా నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సజ్జల రామకృష్ణారెడ్డి: ఫోన్‌ ట్యాపింగే జరగనపుడు విచారణ అవసరం ఏముంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ మాత్రమే చేసి ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఇదంతా చంద్రబాబు దర్శకత్వంలోనే జరుగుతోందన్నారు. విమర్శలు చేస్తోన్న ఎమ్మెల్యేలపై ప్రజలే వేటు వేస్తారని అన్నారు.

బాలినేని శ్రీనివాస్​రెడ్డి:ఫోన్ ట్యాపింగ్‌ను సీఎం జగన్ సీరియస్‌గా తీసుకున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కాదని.. అది రికార్డింగ్ అని ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే ఫోన్ కాల్‌ను ఆయన స్నేహితుడే రికార్డింగ్ చేశారని.. ఫోన్ ట్యాపింగ్‌పై ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి నిరూపించాలని సవాల్​ చేశారు. కోటంరెడ్డిపై చర్యలకు సంబంధించి త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడే ఎందుకు చెప్పారని.. వెళ్లే ముందు ఏదో ఒక విమర్శ చేసి పోతున్నారని అన్నారు.

పేర్ని నాని: కోటంరెడ్డి స్నేహితుడే ఫోన్ రికార్డ్ చేశారని పేర్ని నాని అన్నారు. ఫోన్‌ రికార్డింగ్‌ చేసి ట్యాపింగ్ అంటున్నారని ఆరోపించారు. కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి వచ్చి అన్నీ చెబుతారంటూ పేర్నిపేర్కొన్నారు. డిసెంబర్ 25న చంద్రబాబుతో కోటంరెడ్డి మాట్లాడినట్లు టీడీపీ నేతలు తెలిపారని పేర్ని నాని తెలిపారు. లోకేశ్‌తో కోటంరెడ్డి ఫోన్‌లో మాట్లాడారని చెబుతున్నారని వెల్లడించారు. సీఎం జగన్.. కోటంరెడ్డిని నమ్మితే ఆయన నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు.

ఇదీ సంగతి: నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తమ ఫోన్లను ప్రభుత్వ పెద్దలు ట్యాపింగ్ చేసినట్లు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.

తమ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై సజ్జల, ఇంటలిజెన్స్ చీఫ్ ఆంజనేయులుతో సీఎం చర్చించారు. సమావేశానికి హోం శాఖ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ప్రధానంగా ఇద్దరు నేతల వ్యవహార శైలిపై, తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్లు తెలిసింది. ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రమేయం ఉందని, అనేక ఆధారాలను ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన దృష్ట్యా వీటిపైనా చర్చించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details