రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యాక్రమానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరై ప్రార్థనలో పాల్గొన్నారు.
ఘనంగా గంధమహోత్సవం
By
Published : Sep 12, 2019, 10:48 AM IST
ఘనంగా గంధమహోత్సవం
నెల్లూరు జిల్లాలో విశిష్టంగా నిర్వహించే రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బారా షహీద్ దర్గా వద్ద నిర్వహించే రొట్టెల పండుగులో నిర్వహించే గంధ మహోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోటమిట్ట వద్ద మసీద నుంచి 12 బిందెల గంధాన్ని ఊరేగింపుగా బారాషహీద్ దర్గా ఈద్గా వద్దకు తీసుకొచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కడప దర్గా పీఠాథిపతి ఆరీఫుల్లా హుసేనీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, బారా షహీద్ సమాధులకు గంధాన్ని లేపనం చేశారు. ఈ గంధ మహోత్సవానికి జలవనురల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. గంధోత్సవానకి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు.