ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Class war in YCP: నెల్లూరు వైఎస్సార్​సీపీ​లో ముదిరిన వర్గపోరు.. ​ మరొకసారి బాబాయ్​.. అబ్బాయ్ - AP Latest News

MLA Anil kumar Yadav comments: నెల్లూరు జిల్లా వైఎస్సార్​సీపీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్ చేసిన విమర్శలపై ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి తానే పోటీ చేస్తానని.. తనను అడ్డుకునే వారు ఎవరైనా ఉంటే నేరుగా వచ్చి ఢీకొనాలని ఆయన సవాల్ విసిరారు. నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పైనా అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్​సీపీ నాయకులే తన వెనక గోతులు తవ్వుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Class war in YCP
నెల్లూరు వైసీపీలో మరింత ముదిరిన వర్గపోరు.. బాబాయ్​.. అబ్బాయ్​ మరొకసారి

By

Published : Jun 24, 2023, 1:33 PM IST

నెల్లూరు వైసీపీలో మరింత ముదిరిన వర్గపోరు.. బాబాయ్​.. అబ్బాయ్​ మరొకసారి

MLA Anil kumar Yadav comments: ఇటీవల నెల్లూరు జీజీహెచ్ వైద్యశాల వద్ద డిప్యూటీ మేయర్ రూప్ కుమార్.. ఎమ్మెల్యే అనిల్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సుమారు నెల రోజులు తరువాత నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్ భారీ సభను నిర్వహించారు.బాబాయి రూప్ కుమార్ విమర్శలను తిప్పికొట్టారు. పార్టీ మారుతున్నాననే ప్రచారం మానుకోండి.. మళ్లీ ఫైర్ బ్రాండ్​లా దూసుకుపోతానని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. రాత్రి తాగి మాట్లవద్దని, నాకు సినిమా చూపిస్తానని చెప్పిన ఆయన రావాలని సవాల్ విసిరారు. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్​పై కూడా విరుచుకుపడ్డారు.

కొంత కాలంగా నెల్లూరు నగరానికి దూరంగా ఉన్న నగర ఎమ్మెల్యే ఇటీవల జరిగిన పరిణామాలను వివరించేందుకు భారీ సభను నిర్వహించారు. రూప్ కుమార్ యాదవ్ అనుచరుడిపై దాడి చేయించింది.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనినెల రోజుల కిందట విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులు ఎమ్మెల్యే అనిల్ నగరంలో లేరు. రూప్ కుమార్​ విమర్శలను తిప్పికొడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కొన్ని కారణాల వల్ల నగరానికి దూరంగా ఉన్నానని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. మళ్లీ ఫైర్ బ్రాండ్ లా మారతానని. విమర్శించే వారిని ఢీకొంటానని హెచ్చరించారు. సింహంలా కనిపిస్తేనే గౌరవిస్తారని తెలుసుకున్నానని.. అవసరమైతే రొమ్ములు చీలుస్తానని ఆవేశంగా మాట్లాడారు. రాత్రి తాగి అనిల్​ని ఓడిస్తానని.. పగలు జగన్​జై అని పలకడం కాదు.. దైర్యం ఉంటే ఎదురుగా వచ్చి పోరాటం చేయాలని ఆ పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గానికి సవాల్ విసిరారు. నేను జగన్​కు మిలిటెంట్ స్వాడ్ లాంటి వాడిని. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదు.

వైఎస్సార్​సీపీ తరపున పోటీలో నేను తప్ప ఎవరూ ఉండరు..2024లో అనిల్ బుల్లెట్ ట్రైన్​లా ఉంటాడు. ఎవరు అడ్డు వచ్చినా గుద్దేస్తా. సిటీ నియోజక వర్గంలోని ఇద్దరు వైఎస్సార్​సీపీ నాయకులు తన వెనుక గోతులు తవ్వుతున్నారు. వీరిద్దరూ బాహుబలి, బల్లాల దేవుడిలా ఫీలవుతున్నారు. ఓ రాజమాతను సిటీ నియోజకవర్గంలో పోటీ చేయించాలని తహతహ లాడుతున్నారు. ఇలాంటి నాయకులు ఎన్నికల్లో నాకు సహాయం చేస్తారంటే నమ్మాలా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నంత కాలం తనతో ఉన్న నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్​ను ఉద్దేశించి విమర్శలు చేశారు. జగన్​కు వీరవిథేయుడినని చెప్పారు. నెల్లూరు నగరం నుంచి నేను తప్పా వైఎస్సార్​సీపీ తరపున ఎవరూ పోటీలో ఉండరని చెప్పారు. అంత ధైర్యం ఎవరూ చేయరని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details