ఉదయగిరిలోని యాదవపాలెంలో వైకాపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికంగా వైకాపా బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తమ పార్టీ తరుపున సర్పంచి అభ్యర్థిగా సామ్రాజ్యమును ఎంపిక చేశామని తెలిపారు. కొందరు దొంగ నాయకులు.. తాము వైకాపా వారమని ఓట్లు అడిగేందుకు వస్తారని అలాంటి వారిని నమ్మ వద్దని అన్నారు.
ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే వాహనం అడ్డగింత.. వైకాపా శ్రేణుల మధ్య వాగ్వాదం.. - ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాజా సమాచారం
నెల్లూరు జిల్లా ఉదయగిరి పంచాయతీలోని యాదవపాలెంలో వైకాపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్ధుల విషయంలో వివాదం చెలరేగింది.
ఉదయగిరిలో వైకాపా శ్రేణుల మధ్య వాగ్వాదం
కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగివెళ్తుండగా.. రామయ్య, లక్ష్మయ్య అనే ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే కారును అడ్డగించారు. కష్టపడి పని చేసిన తమను దొంగలుగా చిత్రీకరిస్తారా అని ప్రశ్నించారు. అక్కడే ఉన్న మరి కొందరు నాయకులు వీరితో వాగ్వాదానికి దిగటంతో.. పరిస్థితి గందరగోళంగా మారి తోపులాటకు దారితీసింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేశారు.
ఇదీ చదవండీ..తొలివిడ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర..మెుదలైన ప్రలోభాల పర్వం