ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా, వైకాపా వర్గాల ఘర్షణ ... పలువురికి గాయాలు - Nellore district Vakadu mandal News

ప్రభుత్వ భూముల ఆక్రమించారని రెండు పార్టీల వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడిన ఘటన నెల్లూరు జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెంలో జరిగింది.

రెండు వర్గాల మధ్య ఘర్షణలు... పలువురికి గాయాలు
రెండు వర్గాల మధ్య ఘర్షణలు... పలువురికి గాయాలు

By

Published : Mar 12, 2021, 2:41 AM IST

Updated : Mar 12, 2021, 5:34 AM IST

నెల్లూరు జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెంలో భాజపా, వైకాపా కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గ్రామంలోని ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించారని వాకాడు తహశీల్దార్‌కు రెండ్రోజుల కిందట భాజపా ఫిర్యాదు చేసింది. ఈ అంశమే ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం వాకాడు , గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

Last Updated : Mar 12, 2021, 5:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details