ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో భూవివాదం..తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ - tdp ycp clash in two parties in nellore

నెల్లూరు గ్రామీణంలోని మాదరాజుగూడూరు గ్రామంలో దేవుడి భూమి విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్ణణ తలెత్తింది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాల దాడిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ

By

Published : Oct 13, 2019, 9:44 PM IST

నెల్లూరులో భూమి విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ

నెల్లూరు జిల్లా మాదరాజుగూడూరు గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో ఇరువర్గాలకు చెందిన 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాదరాజుగూడూరు గ్రామంలో దేవుడి భూమి విషయమై గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది. మూడు నెలల క్రితం ఈ విషయంపై ఘర్షణ జరగగా పోలీసులు కేసు నమోదు చేశారని తెదేపా నేతలు చెబుతున్నారు. తమకు చెందిన భూమిని వైకాపా వర్గీయులు ప్రభుత్వం మారగానే లాక్కోవడానికి యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఇరు పార్టీల నేతలు పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details