ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. వేతనాల కోసం ఆవేదన

వాళ్లు కరోనా ఆపత్కాలంలో సైతం బెదరక విధులు నిర్వహించారు. బాధ్యతగా ప్రజలకు సేవలందించారు. ఇప్పుడు వారే కుటుంబ పోషణ భారమై నిరసన బాట పట్టారు. 7 నెలలుగా వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వినతిపత్రం సమర్పిచారు. లేదంటే.. ఈనెల 20 తర్వాత సమ్మె చేపడతామని హెచ్చరించారు.

Sanitation workers protest
పారిశుద్ధ్య కార్మికుల నిరసన

By

Published : Nov 16, 2020, 4:20 PM IST

పెండింగ్​లో ఉన్న తమ వేతనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. స్థానిక తహసీల్దార్ హరనాథ్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. కరోనా ఆపత్కాలంలోనూ బాధ్యతగా విధులు నిర్వహించామని గుర్తుచేశారు.

అధికారులు మాత్రం తమ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలుగా వేతనాలు అందకపోవటం వల్ల కుటుంబ పోషణ భారంగా మారి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అధికారులు చొరవచూపి వెంటనే వేతనాలు మంజూరు చేయాలని కోరారు. లేదంటే ఈనెల 20 తర్వాత సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details