నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా చిన్న ఓబులేసు నియామకం - నెల్లూరు తాజా సమాచారం
నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా ఏపీ హెల్త్ సర్వీస్ స్ట్రెంగ్తెనింగ్ ప్రాజెక్ట్ పీడీగా విధులు నిర్వర్తిస్తున్న ఓబులేసును నియమించారు. ఆయన తన పదవీ బాధ్యతలను చేపట్టారు.
![నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా చిన్న ఓబులేసు నియామకం chinna obulesu appointed as Nellore District Revenue Officer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10864062-204-10864062-1614842674843.jpg)
నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా చిన్న ఓబులేసు నియామకం
నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా చిన్న ఓబులేసు బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు డీఆర్ఓగా విధులు నిర్వర్తించిన రమణ.. ఉద్యోగ విరమణ చేయడంతో.. కొంతకాలంపాటు తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న డీఆర్ఓ పదవిలో.. ఏపీ హెల్త్ సర్వీస్ స్ట్రెంగ్తెనింగ్ ప్రాజెక్ట్ పీడీగా పని చేస్తున్న ఓబులేసును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన తన పదవీ బాధ్యతలను స్వీకరించారు.