నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన మౌలాలి, లక్ష్మణ్, సిధార్ధ అనే ముగ్గురు చిన్నారులు తమ గ్రామ సమీపంలో ఆడుకుంటుండగా అతి వేగంగా అటువైపు వెళుతున్న ఓ ద్విచక్ర వాహనదారుని సెల్ ఫోన్ పిల్లలు ఉన్న సమీపంలో రోడ్డుపై జారి పడిపోయింది. ఇది గమనించి ఫోన్ అందుకున్న ఈ ముగ్గురు చిన్నారులు ఈ ఫోన్ కలిగిన వ్యక్తికి తిరిగి అందజేయాలనే ఆలోచనతో గ్రామ అరుగు వద్ద నిరీక్షిస్తూ ఉన్నారు. ఇంతలో ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఈ ఫోన్ కి ఫోన్ చేసి ఇది నా ఫోను అని తెలపగా తమ గ్రామం వద్ద రోడ్డుపై పడిపోయిందని ప్రస్తుతం తమ వద్ద ఉందని వచ్చి తీసుకుని వెళ్ళండి అని ఈ పిల్లలు తెలిపారు. దీంతో ఫోను పోగొట్టుకున్న వ్యక్తి తిరిగి గ్రామానికి వచ్చాడు. పోగొట్టుకున్న ఫోనును పిల్లల దగ్గర నుంచి తీసుకున్నాడు.వారికి ధన్యవాదాలు చెబుతూ పిల్లలను అభినందించారు.
రోడ్డు మీద ఫోన్ దొరికితే.. ఈ పిల్లలు ఏం చేశారో తెలుసా..? - రోడ్డు మీద ఫోన్ దొరికితే.. ఈ పిల్లలు ఏం చేశారో తెలుసా..?
ఈ రోజుల్లో ఫోన్ ఎవరిదైనా పోయింది అంటే ఇంక అది దొరకడం కష్టమని వదిలేస్తాం. పోలీసు కంప్లైంట్ ఇచ్చినా సరే పోయిన ఫోన్ తిరిగి దక్కడం కష్టం. అయితే ముగ్గురు చిన్నారులు మాత్రం వారికి దొరికిన ఫోన్ ను జాగ్రత్తగా పోగుట్టుకున్న వ్యక్తికి అందించారు. ఫోన్ కావాలని మారం చేసే పిల్లలు ఉన్న ఈరోజుల్లో రోడ్డు మీద దొరికిన ఫోన్ను జాగ్రత్తగా తిరిగి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికే ఇవ్వడం అనేది చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఆ చిన్నారులు ఎవరంటే..

Children's talent