Sangam Barrage Opening: నెల్లూరు జిల్లా సంగం వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజీని మంగళవారం ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇదే కాకుండా బ్యారేజీపై ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మేకపాటి గౌతం విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. అనంతరం నెల్లూరు బయలుదేరనున్నారు.
అధికారుల అత్యుత్సాహం.. సీఎం పర్యటనకు ఒకరోజు ముందే షాపుల మూసివేత
Sangam Barrage: నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజీని రేపు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే బ్యారేజీపై ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అయితే ప్రారంభానికి ముందు రోజు నుంచే అధికారులు అత్యుత్యాహం ప్రదర్శించి.. షాపులు మూయించారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం కార్యక్రమం ఉంటే..అధికారులు అత్యుత్సాహంతో ప్రధాన రహదారిపై ఉన్న షాపులను, సంగం ప్రధాన కూడలిలో ఉన్న షాపులన్నీ ఈరోజు ఉదయం నుంచే మూసివేయించారు. సీఎం హెలిపాడ్ నుంచి బ్యారేజ్ వరకు సుమారు మూడు కిలోమీటర్లు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రేపు ఉదయం నుంచి నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై వాహనాలను కూడా నిలిపివేస్తున్నట్టు అధికారులు సూచించారు. బ్యారేజీ ప్రారంభోత్సవ సమయంలో కేవలం ఓ పత్రికకు మాత్రమే అనుమతించారు. అలాగే సమావేశం వద్ద కూడా మీడియా వారికి అనుమతి నిరాకరించారు.
ఇవీ చదవండి: