CM Jagan: కందుకూరు మృతులకు రాష్ట్ర ప్రభుత్వం.. రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వారికి 50 వేల చొప్పున అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. నిర్వహించిన సభలో ఎనిమిది మంది అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే.. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్.. కందుకూరు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు తెలిపారు.. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
కందుకూరు మృతులకు 2లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్.. - కందుకూరు ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
CM Jagan: ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. నిర్వహించిన సభలో మృతి చెందిన ఎనిమిది మందికి సీఎం జగన్ సంతాపం తెలిపారు.. మృతులు ఒక్కొక్కరికి 2లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు..

ముఖ్యమంత్రి జగన్
TAGGED:
CM Jagan