ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలు ఆర్థికంగా ఎదగాలి - ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్

పొదుపు మహిళలకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ భరోసా ఇచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల జరిగిన సమావేశంలో మేనేజర్ మహిళలకు రూ.1.60 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

చెక్కులు తీసుకుంటున్న పొదుపు మహిళలు

By

Published : Jul 9, 2019, 1:54 PM IST

బ్యాంకు ద్వారా పొదుపు రుణాలు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జిల్లా రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు, వ్యాపారులకు కోటి 60 లక్షల రుణాల చెక్కులు అందేజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్యాంకు ద్వారా జరుగుతున్న లావాదేవీలు 100% బాగా జరుగుతున్నాయని తెలిపారు. పొదుపు మహిళలకు కోటి 10 లక్షల రుణాల చెక్కులను, వ్యాపారస్తులకు 50 లక్షల ముద్ర రుణాల చెక్కులు పంపిణీ చేశారు. బ్యాంక్​లో డిపాజిట్లు చేసుకోవడం ద్వారా అధిక వడ్డీ పొందుతారని తెలిపారు. గ్రామీణ ప్రాంత వాసులు తమ పిల్లలు చదువుల కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీ కడితే కట్టిన వడ్డీ మూడు నెలలకు తిరిగి ఇస్తారన్నారు. అనంతరం పొదుపు మహిళలకు వ్యాపారస్తులకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు.

చెక్కులు అందజేస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details