నెల్లూరు జిల్లా గూడూరులోని చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై, బెంగళూర్, కేరళ రాష్ట్రాల నుంచి నడిచివెళ్తున్న వలస కార్మికులకు చెప్పులు, అరటిపండ్లు, చపాతీలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. గూడూరు పట్టణ సీఐ దశరథరామయ్య కార్మికుల కాళ్లకు చెప్పులు తొడిగారు.
వలస కూలీలకు చెగువేరా ఫౌండేషన్ చేయూత - cheguvera foundation help to migrant workers in nellore
జాతీయ రహదారిపై కాళ్లకు చెప్పులు లేకుండా నడిచివెళుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలసకూలీలకు నెల్లూరు జిల్లా గూడూరులోని చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెప్పులు, చపాతీలు, అరటిపండ్లు, బిస్కెట్లు అందజేశారు. గూడూరు పట్టణ సీఐ దశరథరామయ్య కార్మికుల కాళ్లకు చెప్పులు తొడిగారు.
అనంతరం సీఐ మాట్లాడుతూ.. చెగువేరా ఫౌండేషన్ లాక్ డౌన్ మొదలైన రోజునుంచి ప్రతిరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షుడు మాండ్ల సురేష్ బాబు, వారి పైలట్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.