ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్లకు వెళ్లి తెదేపా నేతలను పలకరించిన చంద్రబాబు - నెల్లూరులో చంద్రబాబు పర్యటన

తెదేపా నేతల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు.. వారితో కాసేపు ముచ్చటించారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నెల్లూరులో ఆయన పర్యటిస్తున్నారు.

chandrababu nellore tour, chandrababu went to nellore party leaders houses
నెల్లూరులో చంద్రబాబు పర్యటన, నెల్లూరులో పార్టీ నేతల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు

By

Published : Apr 10, 2021, 8:19 PM IST

తెదేపా నేతల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి నెల్లూరు వచ్చిన చంద్రబాబు.. స్థానిక తెదేపా నేతలను ఇళ్లకు వెళ్లి పలకరించారు. సర్వేపల్లి నియోజకవర్గ ముఖ్యనేతలతో నగరంలోని అనిల్ గార్డెన్స్​లో సమావేశమైన అనంతరం.. పలువురు పార్టీ నేతల కుటుంబాలను కలిశారు.

ఇదీ చదవండి:మహిళపై పెట్రోల్​ పోసి సజీవదహనం.. ఆపై తానూ..

తెదేపా సీనియర్ నేతలు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, మంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, సుబ్బానాయుడుల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు.. కాసేపు వారితో ముచ్చటించారు. కుటుంబ సభ్యులు, ఇతర కార్యకర్తలతో ఫోటోలు దిగి వారిలో ఆనందాన్ని నింపారు. ఆపత్కాలంలో పార్టీ కోసం కష్టపడే వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

గూడూరులో పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details