Chandrababu visited Idumudi Rajeshwari family: కందుకూరు దుర్ఘటనలో మృతి చెందిన ఈదుమూడి రాజేశ్వరి చిత్రపటానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్థిక సహాయాన్ని అందించారు. అన్నివిధాలా అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తనపై దాడి చేస్తే పారిపోతానని సీఎం జగన్ అనుకుంటున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడనంత జనం ఇప్పుడు సభలకు వస్తున్నారని తెలిపారు.
సానుభూతితో వ్యవహరించాల్సిన వారే వెక్కిరిస్తున్నారు..: చంద్రబాబు - కందుకూరులో తెదేపా సభ ఘటనపై సీఎం జగన్ కామెంట్స్
Idumudi Rajeshwari: దుర్ఘటన జరిగితే సానుభూతితో వ్యవహరించాల్సిన సీఎం వెక్కిరిస్తూ మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు దుర్ఘటనలో మృతి చెందిన ఈదుమూడి రాజేశ్వరి చిత్రపటానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నినాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.

కందుకూరులో టీడీపీ సభ నిర్వహించిన చోటే రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ కూడా సభలు నిర్వహించారని గుర్తుచేశారు. ఘటనకు ముందు పోలీసులకు పలుమార్లు చెప్పినా స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన తర్వాత పుండుమీద కారం చల్లినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దుర్ఘటన జరిగితే సానుభూతితో వ్యవహరించాలిసిన సీఎం వెక్కిరిస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. కొండేపీలో చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కొండేపీ మండలం కట్టావారి పాలెంలో పొగాకు రైతులు, కూలీలతో చంద్రబాబు మాట్లాడారు.
ఇవీ చదవండి: