ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chandrababu letter to DGP: 'దాడికి గురైన దళితులపైనే అక్రమ కేసులు' - తెదేపా అధినేత చంద్రబాబు న్యూస్

తెదేపా అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో దాడికి గురైన ఎస్సీలపైనే అక్రమ కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. మల్లికార్జున్‌ అనే వ్యక్తి పై దాడికి సంబంధించి వీడియోను లేఖకు జత చేశారు.

chandrababu letter to DGP
chandrababu letter to DGP

By

Published : Jun 20, 2021, 12:59 PM IST

Updated : Jun 20, 2021, 3:24 PM IST

నెల్లూరు జిల్లా పైడేరు కాల్వలో వైకాపా నేతలు మట్టి మాఫియాను ప్రశ్నించినందుకు కొడవలూరు మండలం కమ్మపలేం గ్రామానికి చెందిన కరాకట మల్లికార్జున్​పై నలుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొడవలూరు పోలీసులు మల్లికార్జున్​పైనే తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయటంతో పాటు అతనిపైనే రౌడీషీట్ తెరిచారని తప్పుబడుతూ డీజీపీకి లేఖ రాశారు. ఒక ఎస్సీ యువకుడిని వేధించేందుకు పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి ఇలా చేయటం దుర్మార్గమని దుయ్యబట్టారు.

పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేనివిధంగా పోలీసు చర్యలు ఉన్నాయని ఆరోపించారు. అసలు నేరస్థులపై వెంటనే చర్యలు తీసుకుని మల్లికార్జున్‌పై దాఖలైన తప్పుడు కేసులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. మల్లికార్జున్‌ను తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నించిన కొడవలూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. మల్లిఖార్జున్​పై దాడికి సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు లేఖకు జత చేశారు.

ఇదీ చదవండి:యూట్యూబ్​లో చూసి.. నేరాలు నేర్చుకుంటున్నారు!

Last Updated : Jun 20, 2021, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details