జగన్మోహన్రెడ్డి... జగన్నాటకాలు వద్దు!
తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా పట్టణంలోని అనిల్ గార్డెన్స్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పత్రిక ఎడిటర్‌పై దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 'మా ఇంటిపై డ్రోన్ ఎగురవేస్తే ప్రమోషన్ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు... తప్పుచేసిన అధికారులకు శిక్షలు తప్పవు. ఇసుకను సామాన్యులకు దొరక్కుండా చేశారు. ముడుపుల కోసమే మద్యం ధరలు పెంచారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రగల్భాలు పలికి.. ఈ రోజు 6500 ఇస్తామంటున్నారు. జగన్...మీ కార్యకర్తల కోసం, మా కార్యకర్తల వద్ద పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జె ట్యాక్స్ వేస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.' అని చంద్రబాబు విమర్శించారు.