ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కందుకూరు బాధిత కుటుంబాలకు చంద్రబాబు భరోసా.. ఇంటి పెద్దగా ఉంటానని హామీ - compensation to kandukuru victim families

CBN CONSOLED KANDUKURI VICTIMS FAMILIES : నెల్లూరు జిల్లా కందుకూరు బహిరంగ సభ తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాల్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓదార్చారు. పార్టీ తరఫున ప్రకటించిన పరిహారం చెక్కులు అందజేశారు. పార్టీ అండగా ఉంటుందని,. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

CBN CONSOLED KANDUKURI VICTIMS FAMILIES
CBN CONSOLED KANDUKURI VICTIMS FAMILIES

By

Published : Dec 29, 2022, 4:10 PM IST

CBN COMPENSATION : ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ వస్తున్నా కార్యకర్తల భావోద్వేగంతో దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న తన కళ్ల ముందే జరిగిన ఘటన ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. విధి వక్రీకరించి, దేవుడు చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించారు.

బాధితుల కుటుంబ సభ్యుల ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేవని.. కానీ ఓ కుటుంబ పెద్దగా వారి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను చేసే ఉద్యమం రాష్ట్రం కోసమన్న చంద్రబాబు.. చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధులుగా మారారన్నారు. మృతుల కుటుంబాలు వేర్వేరు గ్రామాల్లో ఉన్నా చంద్రబాబు అందరి ఇళ్లకూ స్వయంగా వెళ్లి మృతుల భౌతికకాయాలు, చిత్రపటాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

తొలుత ఓబూరులో గడ్డం మధు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు వారికి పరిహారం చెక్కును అందచేశారు. అనంతరం గుర్రంవారిపాలెం వెళ్లి కాపుమాని రాజా కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత కొండమురుసుపాలెంలో కలవపూరి యానాది కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కందుకూరు ఘటన.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు భరోసా.. ఇంటి పెద్దగా ఉంటానని హామీ

"నేను కూడా చాలా సార్లు రోడ్​షోలు చేశా. తర్వాత రాజశేఖర్​ రెడ్డి కూడా చేశాడు. ఇది బాధాకరమైన ఘటన. ఇలాంటివి జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు ఇరుకు రోడ్లలో మీటింగ్​లు పెట్టాల్సిన అవసరం లేదు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నన్ను చూడని ప్రజలు ఎవరూ లేరు. కందుకూరులో ఎన్టీఆర్​ విగ్రహం వద్ద నేను మాత్రమే కాదు చాలా రాజకీయ పార్టీలు కూడా మీటింగులు అక్కడే పెట్టాయి"-చంద్రబాబు, టీడీపీ అధినేత

భోజన విరామం అనంతరం చంద్రబాబు గుండ్లపాలెం వెళ్లి ఊటుకూరి పురుషోత్తం కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం అమ్మవారిపాలెంలో మార్లపాటి చినకొండయ్య నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. అక్కడి నుంచి ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో దేవినేని రవీంద్రకు నివాళులర్పించిన చంద్రబాబు.. అక్కడి నుంచి వరిచేను సంఘం గ్రామంలో ఏకశిరి విజయ నివాసానికి వెళ్లారు. ఘటన పట్ల ఎవ్వరినీ నిందించను కానీ తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని చంద్రబాబు తేల్చిచెప్పారు.

ప్రజలు భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి టీడీపీ సభలకు పెద్దఎత్తున వస్తున్నారన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే, దానిని విమర్శించాలనుకోవటం తప్పని సూచించారు. కందుకూరు ఎన్టీఆర్ సెంటర్​లో అన్ని రాజకీయ పార్టీలు సభలు పెట్టాయని.. నిన్న జరిగిన సభే మొదటిది కాదని గుర్తు చేశారు. కావలి సభలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణుల్ని కోరారు. ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మన జాగ్రత్తలు మనమే తీసుకుందామని దిశానిర్దేశం చేశారు.

"నేను కార్యకర్తలకు ఒకటే సూచిస్తున్న. ప్రభుత్వం మనకు సహకరించకపోయినా.. మనమే జాగ్రత్తగా ఉంటూ మీటింగులు జరుపుకుందాం. స్వాతంత్య్రం కోసం అప్పుడు ఎలాగైతే ఉద్యమాలు చేశారో.. ఈరోజు రాష్ట్రాన్ని, తెలుగుజాతిని, ప్రజల భవిష్యత్తును కాపాడడానికి చేసే ఉద్యమం ఇది"-చంద్రబాబు, టీడీపీ అధినేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details