దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్థం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. సంగీతం, లలిత కళల ప్రోత్సాహం ద్వారా బాలు కల నెరవేర్చాలన్నారు. అలాగే ఏటా బాలు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సీఎం జగన్కు చంద్రబాబు లేఖ రాశారు.
'బాలు కల నెరవేర్చాలి'.... సీఎం జగన్కు చంద్రబాబు లేఖ - chandra babu letter to cm jagan
గగనానికేగిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తుగా నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ముఖ్యమంత్రి జగన్ను తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఆ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. అలాగే బాలు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
Chandrababu letter to cm jagan
'నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పి అందులో బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాన్ని బాలు సంగీత కళాక్షేత్రంగా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ సంగీత అకాడమీకి ఎస్పీ బాలు పేరు పెట్టాలి. ఎస్పీబీ పేరు మీద జాతీయ పురస్కారం ఏర్పాటు చేయాలి' అని చంద్రబాబు లేఖలో కోరారు.