Chandrababu Comments on Jagan : జగన్‌కు బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన బీసీలకు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే బీసీ సంక్షేమంపైనే తొలి సంతకం పెడతామని ప్రకటించారు. బీసీ ద్రోహి జగన్మోహన్రెడ్డి అని ఎద్దేవా చేశారు. బీసీల సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేసి.. చర్చలకు జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. ఆధునిక పనిముట్లు ఇచ్చి కులవృత్తుల గౌరవం కాపాడిన పార్టీ టీడీపీ అని తెలిపారు. అవినీతిని ప్రశ్నించిన బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. బీసీ ద్రోహి జగన్ రెడ్డిని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు.
జగన్‌కు బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది: చంద్రబాబు - నేటి తెలుగు వార్తలు
Chandrababu Comments on Jagan : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ బీసీలకు చేయూతనిచ్చిందని తెలిపారు. టీడీపీ బీసీ సంక్షేమం కోసం నిర్వహించిన కార్యక్రమాలను వైసీపీ తొలగించిందని విమర్శించారు.
చంద్రబాబు
"గత ఎన్నికలలో ముఖ్యమంత్రి బీసీలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకబడిన బీసీల అభివృద్ధి కోసమే సంతకం చేస్తానని హమీ ఇస్తున్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఇచ్చాము. అధునిక పనిముట్లు అందించాము. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని తొలగించాడు." -చంద్రబాబు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి: