నెల్లూరు జిల్లాలో తడిచిన ధాన్యాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. ఇటీవల ఎగువన కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి పెన్నా పరివాహక ప్రాంతం ద్వారా కిందకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయా ప్రాంతంలో కోతకు వచ్చిన పంటలు నీట మునిగాయి. దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్ర బృందం సంగం మండలంలో పర్యటించింది. సంగం, పెరమన, కోలగట్ల, గ్రామాలలో ముంపునకు గురైన పంటలను పరిశీలించి, తడిచిన ధాన్యం నమూనాలను సేకరించింది. ఈ సందర్భంగా రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.
జిల్లాలో కేంద్ర బృందం పర్యటన..పంట నష్టం పరిశీలన - నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. వరదలు కారణంగా ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో కేంద్ర బృందం పర్యటన