ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడి రైతులకు కిసాన్​ క్రెడిట్​ కార్డులు

కేంద్ర ప్రభుత్వం పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తుందని జిల్లా పశు సంవర్థక శాఖ జాయింట్​ డైరెక్టర్​ నిజమోహన్​ తెలిపారు. వీటి ద్వారా ఎలాంటి అనుమతులు లేకుండా మూడు లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్లు ఆయన నెల్లూరులో తెలియజేశారు.

Breaking News

By

Published : Jun 13, 2020, 11:45 AM IST


ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తుందని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నిజ మోహన్ తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.నెల్లూరు జిల్లాలో 27 వేల మంది పాడి రైతులకు కిసాన్ కార్డులు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశామని త్వరలోనే వీరందరికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామన్న ఆయన ఈ అవకాశాన్ని జిల్లా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details