రామాయపట్నం ఓడరేవును మేజర్ పోర్టు కింద చేపట్టడానికి మరోసారి సాధ్యాసాధ్యాల నివేదికను తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం ఓడరేవు నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాన్ని కేంద్ర బృందం త్వరలో పరిశీలించనుంది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేసి ఆర్థిక సహకారాన్ని అందించే విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఓఅధికారి తెలిపారు. రైట్స్ సంస్థ రూపొందించిన డీపీఆర్ ఆధారంగా పోర్టు మొదటి దశ నిర్మాణానికి రూ.2,647 కోట్లతో పనులను చేపట్టడానికి వీలుగా ఇటీవల టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఒకవేళ మేజర్ పోర్టు కింద చేపట్టాలని భావిస్తే నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తుంది.
రామాయపట్నంపై మరోసారి నివేదిక
రామాయపట్నం ఓడరేవును మేజర్ పోర్టు కింద చేపట్టడానికి మరోసారి సాధ్యాసాధ్యాల నివేదికను తయారు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఓడరేవు నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాన్ని కేంద్ర బృందం త్వరలో పరిశీలించనుంది.
Center decides to prepare another feasibility report for taking over Ramayapatnam port under major port