సిమెంట్ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ రేవూరు మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఆత్మకూరు మండలం అశ్వినిపురం గ్రామం నుంచి లక్కరాజు పల్లి గ్రామానికి ఇటుకలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అదుపు తప్పి సిమెంట్ ఇటుకల ట్రాక్టర్ బోల్తా - nellore district latest accident news
అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో సిమెంట్ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు మహిమలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
బోల్తా పడ్డ సిమెంట్ ట్రాక్టర్
TAGGED:
నెల్లూరు జిల్లా తాజా వార్తలు