నెల్లూరు జిల్లా దగదర్తి జాతీయ రహదారిపై 2018 డిసెంబర్లో చోరీకి గురైన సెల్‌ఫోన్ లోడ్ లారీ కేసులో పోలీసులు మరో నిందితుణ్ని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఇదే కేసులో గతేడాది ఆగస్టులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సిటీ నుంచి కలకత్తా వెళ్తున్న చరవాణి లోడ్‌తో ఉన్న లారీని 2018 డిసెంబర్లో మహారాష్ట్రకు చెందిన కంజర్ భట్స్ ముఠా చోరీ చేసింది. దొంగిలించిన సెలఫోన్ల విలువ 4 కోట్ల 80 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి మొత్తం డబ్బులను రికవరీ చేస్తామని జిల్లా ఎస్పీ భాస్కరన్ భూషణ్ తెలిపారు.
సెల్‌ఫోన్ లారీ చోరీ కేసులో మరో నిందితుడు అరెస్ట్
నెల్లూరు జిల్లాలోని దగదర్తి జాతీయ రహదారిపై 2018 డిసెంబర్లో జరిగిన సెల్‌ఫోన్ లోడ్‌తో వెళ్తున్న లారీ చోరీ కేసులో పోలీసులు తాజాగా మరో నిందితుణ్ని అరెస్టు చేశారు. గతంలో ఆరుగురిని కటకటాల్లోకి నెట్టిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
చరవాణీ లోడ్ లారీ కేసులో వ్యక్తి అరెస్ట్